
పాత నేరస్తులపై నిఘా పెంచాం..
పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచాం. మార్కెట్ ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్ మఫ్టీలో ఉంటూ నిఘా కొనసాగుతోంది. పెట్రోలింగ్ బీట్స్ పెంచాం. క్రైం టీమ్ మఫ్టీలో బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. పట్టణాల్లో 24గంటలూ పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. డయల్ 100కు సమాచారం ఇస్తే ఐదు నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్స్ పోలీసులు మీ వద్ద ఉంటారు. ఈ నెల 23న రాత్రి చెడ్డి గ్యాంగ్ వ్యూహాన్ని తిప్పికొట్టాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ,