వ్యభిచార ముఠా గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Sep 25 2025 7:27 AM | Updated on Sep 25 2025 7:27 AM

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

● పక్కా సమాచారంతో పోలీసుల దాడి ● వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో వ్యభిచార ముఠా గుట్టును పట్టణ పోలీసులు రట్టు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన మహిళలు నాఫీస్‌ బేగం, బిల్కీస్‌ చంద్‌ నిర్మల్‌లోని ఇంద్రానగర్‌ ప్రాంతంలో ఓఇంటిని కేంద్రంగా చేసుకుని కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్నారు. మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారన్నారు. విటులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపా రు. పక్కా సమాచారంతో పోలీసులు ఇంటిపై దాడి చేసి మహిళలు, విటుడు ఇర్షద్‌ను అరెస్టు చేసి రెండు మొబైల్‌ ఫోన్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

జిల్లాలో అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన షేక్‌ రౌఫ్‌ అలియాస్‌ షేక్‌ రౌఫ్‌ రహీం ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్‌ బియ్యం పాలిషింగ్‌ చేసి విక్రయిస్తున్నాడన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని రైస్‌మిల్లుల్లో సన్నగా పాలిష్‌ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో నిర్మల్‌ జిల్లాతోపాటు చుట్టుపక్కల గల జిల్లాలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడన్నారు. గతంలో రౌఫ్‌కు సంబంధించిన 12 టైర్ల లారీని భైంసాలో జప్తు చేసినట్లు తెలిపారు.

గతంలో నిర్మల్‌కు చెందిన వ్యక్తి కిడ్నాప్‌

పట్టణంలోని సోఫీనగర్‌కు చెందిన షేక్‌ తహేర్‌ బియ్యం దందా చేస్తున్నాడని, ఈ క్రమంలో ధర్మాబాద్‌ (మహారాష్ట్ర)కు చెందిన షేక్‌ రౌఫ్‌ భైంసాకు చెందిన అతని భాగస్వామి రహీజ్‌కు బియ్యం సంబంధిత లావాదేవీలలో రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో లావాదేవీల పరిష్కారానికి దందాలు చేసే ఇబ్రహీం బిల్డర్‌ అలియాస్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఇబ్రహీంతో రూ.1.50 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో మహమ్మద్‌ అబ్దుల్‌ ఐదుగురితో కలిసి జూలై 2, 2025న నిర్మల్‌కు వచ్చి షేక్‌ తాహేర్‌ బంధువును కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనలో నిర్మల్‌ పోలీసులు ఇబ్రహీం బిల్డర్‌ను 5 జూలై, 2025న అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంట్లో ప్రధాన నిందితుడైన షేక్‌ రౌఫ్‌ను మంగళవారం రాత్రి నాందేడ్‌లో పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాగా షేక్‌ రౌఫ్‌పై భైంసా, బాసర, తానూరు పోలీస్‌స్టేషన్‌లలో సైతం కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement