
రెండెకరాల్లో సాగు చేశా..
చెన్నూర్: మూడేళ్ల నుంచి బంతిపూల సాగు చే స్తున్నా. రెండేళ్లు పూ లకు మంచి డిమాండ్ ఉండడంతో లాభాలు వచ్చాయి. ఈ ఏడాది మండలంలో పూల సాగు పెరగడంతో డి మాండ్ తగ్గింది. గతేడాది వ్యాపారులు మా గ్రామానికి వచ్చి పూలు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. ఈ ఏడాది మేమే హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు పూలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలపైనే ఆశ ఉంది.
– పుప్పాల రాజమౌళి, శంకరాపూర్
లాభదాయకమే..
వేమనపల్లి: నీల్వాయి సమీపంలో 30 గుంటలు కౌలుకు తీసుకుని బంతిపూలు సాగు చేశాం. కిలోకు రూ.వందచొప్పున విక్రయిస్తున్నాం. నీల్వాయి వాగు వంతెన సమీపంలో రహదారి పక్కనే ఉండటంతో చాలా మంది కొనుగోళ్ళకు వస్తున్నారు. 30 గుంటల్లో 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గోదావరిఖని, మంచిర్యాల నుంచి వ్యాపారులు వచ్చి పూలు కొనుగోలు చేస్తున్నారు. పురుగు బెడద లేకుండా మందులు పిచికారీ చేసుకుంటే బంతిసాగు మంచి లాభదాయకమే.
– మోర్ల సమత, నీల్వాయి, వేమనపల్లి

రెండెకరాల్లో సాగు చేశా..