
సెపక్‌తక్రా పోటీల్లో ఉమ్మడి జిల్లాకు రెండోస్థానం
రెబ్బెన(ఆసిఫాబాద్): మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్రస్థా యి సీనియర్ సెపక్‌తక్రా పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషుల జట్టు రెండోస్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన ఫైనల్‌లో ఉమ్మడి జిల్లా జట్టు హైదరాబాద్ జట్టుతో తలపడింది. హైదరాబాద్ జట్టు విజయం సాధించగా జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా ఒలింపిక్ చీఫ్ పాట్రాన్ ఆర్.నారాయణరెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్ అసో సియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్‌తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, సాంబయ్య, షార్ప్ స్టార్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అభినందించారు.