
ఆదివాసీలకు అవకాశం కల్పించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి అటవీశాఖ రేంజ్ పరిధిలో వాచర్, ఎనిమల్ ట్రాకర్ పో స్టుల్లో ఆదివాసీలకు అవకాశం కల్పించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. గిరిజన చట్టా లు అమలులో ఉన్న గిరిజన మండలంలో ఆయా పోస్టుల్లో ఆదివాసీలెవరూ లేరని తెలి పారు. ఉన్నత చదువులు చదివిన వారు నిరుద్యోగంతో సతమతం అవుతున్నారని, అధికా రులు ఆదివాసీలకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా సలహాదారుడు కనక ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొర్ల వెంకటేశ్, నాయకులు కుమురం మారుతి, ఆత్రం లక్ష్మణ్, బూత బాపూరావు పాల్గొన్నారు.