
వాగు దాటితేనే ఊరికి..
ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి, ఆర్‌ఆర్ కాలనీ ప్రజలు వాగు ఉప్పొంగి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.86 కోట్లు మంజూరు చేసింది. దీంతో గతేడాది వాగుపై ఉన్న కల్వర్టు తొలగించి వంతెన పనులు ప్రారంభించారు. పనులు మధ్యలోనే వదిలేయడంతో గ్రామానికి సరైన దారి లేకుండా పోయింది. మంగళవారం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామస్తులు ఇలా ప్రమాదకరంగా వాగు దాటారు. వరద ఉధృతి పెరిగితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయని, అధికారులు స్పందించి వంతెన పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– ఆసిఫాబాద్‌రూరల్
వాగు దాటుతున్న గ్రామస్తులు