
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆసిఫాబాద్‌అర్బన్: నిత్య జీవితంలో పనిఒత్తిడితో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదని, ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్ శివాలయం ఆవరణలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యశిబిరంలో కీళ్లు, కాళ్ల నొప్పులు, హైబీపీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, జలుబు, దగ్గు ఇతర వ్యాధులకు ఆయుర్వేద ఔషధాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్యాంపు ఇన్‌చార్జి కిరణ్‌కుమార్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి వినోద్, డాక్టర్లు సుజాత, నరేందర్, రాకేశ్, ఫార్మసిస్టులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.