
‘మైక్రో బ్రూవరీల ఏర్పాటు సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు సరికాదని, ఎకై ్సజ్‌శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ మైక్రో బ్రూవరీల ఏర్పాటుతో విద్యార్థులపై ప్రభావం పడుతుందని, మద్యం వినియోగం పెరిగి హింస, అశాంతికి దారి తీస్తుందన్నారు. ఇప్పటికే వైన్స్‌లు, బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని తెలిపారు. మైక్రో బ్రూవరీల నోటిఫికేషన్‌ను వెంట నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్, రాకేశ్, వికాస్ పాల్గొన్నారు.