
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: ఫిర్యాదులు క్షుణ్నంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించా రు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య స్థితి తెలుసుకుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రిపుల్, రాష్, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజ మానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, ప్రజలకు ఇబ్బందులు సృష్టించేలా బైక్‌లకు సైలెన్సర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను చైన్‌స్నాచింగ్, ఇతర అంసాఘింక కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉందని, ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.