
వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు పట్టణంలోని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ము న్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పెరక శ్రీకాంత్ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో దసరా, బతుకమ్మ పండుగకు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని డీఎంఎఫ్ నుంచి లేదా ఏదైనా ఇతర ఫండ్ నుంచి వేతనాలు ఇప్పించాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు మోతీరాం, శ్రీనివాస్, ప్రభాకర్, వెంకట్, సాగర్ పాల్గొన్నారు.