
యూరియా కేటాయించాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాకు మరింత యూరి యా కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ గోపికి సోమవారం హైదరాబాద్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని రైతులు యూరియా సరిపడా అందక ఇబ్బందులు పడుతున్నారని, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సక్రమంగా యూరియా పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మినర్సయ్య, మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్, ఉపాధ్యక్షుడు రఘునాథ్, నాయకులు ఉన్నారు.