
యూరియా కోసం రైతుల రాస్తారోకో
బెజ్జూర్(సిర్పూర్): యూరియా సకాలంలో అందించడం లేదని సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ గంటల తరబడి పడిగాపులు కాస్తు న్నా యూరియా అందడం లేదని, సకాలంలో ఎరువులు చల్లకపోతే పంటలు నష్టపోతామ ని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీఎంస్ ద్వారా యూరియా కేటాయించిన గ్రామాల్లోని రైతులు కూడా మళ్లీ సొసైటీకి రావాల్సి వస్తోందన్నారు. డీసీఎంఎస్ ద్వారా గ్రామాలకు కేటా యించిన యూరియా ఎక్కడ పంపిణీ చేశారో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వి షయం తెలుసుకున్న ఏవో నాగరాజ్, ఎస్సై సత్తార్ పాషా ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కూపన్లు రాసి ఇస్తామని తె లపడంతో రైతులు రాస్తారోకో విరమించారు.