
కొలువుదీరిన దుర్గమ్మ
ఇందిరానగర్‌లో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
ఆసిఫాబాద్/రెబ్బెన: జిల్లావ్యాప్తంగా సోమవారం శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలంకరించిన మండపాల్లో అమ్మవారు దుర్గామాత, శారదామాత రూపాల్లో కొలువుదీరారు. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీ ఆలయంలో అర్చకులు శ్రీధర్ శర్మ, వాసవీ మందిరంలో రాజశేఖరశర్మ, కేశవనాథ ఆలయంలో నరేశ్ శర్మ, మధుకరశర్మ ప్రత్యేక పూజలు చేశారు. కాగా, రెబ్బెన మండలంలోని గోలేటి, గంగాపూర్ గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందిరానగర్‌లోని కనక దుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదట అమ్మవారికి ప్రాణప్రతిష్ట పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పలువురు భక్తులు అమ్మవారి మాల స్వీకరించారు. అమ్మవారికి పూజలు చేయడంతోపాటు గుహలో కొలువైన మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

కొలువుదీరిన దుర్గమ్మ

కొలువుదీరిన దుర్గమ్మ