
జీవో 12ను సవరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జీవో 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ నిధులు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వంగూరి రాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా మూడో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన రూ.346 కోట్లను వెంటనే తిరిగి ఇవ్వాలన్నారు. 55 ఏళ్లు నిండిన కార్మి కులకు రూ.9 వేల కనీస పెన్షన్ ఇవ్వాలని, పెళ్లి, ప్రసూతి కానుక రూ.లక్షకు పెంచాలని, సహజ మరణానికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందించాలన్నారు. వెల్ఫేర్ బో ర్డు ద్వారా కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని కోరారు. పట్టణాల్లో కార్మికుల కోసం షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి శ్రీని వాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు అశోక్, ఆనంద్‌రావు, రాంచందర్, వెంకన్న, మహేశ్, సదయ్య, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.