ఆసిఫాబాద్‌రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పని చేసే డైలీవేజ్ వర్కర్ల సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న చెట్టుకు ఉరితాళ్లు వేసుకొని ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, కృష్ణమాచారి, వసంత్ రావు, కోటయ్య, భరత్, కార్మికులు శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి, ప్రమీల, తిరుపతి, దివ్య, మాన్కుబాయి తదితరులు పాల్గొన్నారు.