
రైల్వేస్టేషన్‌కు దారేది?
ఇది కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారుల్లోఒకటి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సంజీవయ్య కాలనీ బోర్డు, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింది నుంచి ఈ మార్గం గుండా స్టేషన్‌కు చేరుకోవాలి. నిత్యం ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్ర వాహనాలు నిలిపి ఉంటాయి. రోడ్డు సైతం ఇరుకుగా ఉంది.
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సరైన దారి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందేభారత్‌తోపాటు ఇతర ముఖ్యమైన రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం కల్పించడంతో ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు పెరిగాయి. సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) ప్రహరీ పక్క నుంచి ఉన్న రహదారి వెంట వెళ్లాలంటే అక్కడ ఎస్పీఎంకు సంబంధించి కర్రలోడ్ లారీలు ఉంటున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింది నుంచి అశోక్ కాలనీ మీదుగా వెళ్లాలంటే ఆ రోడ్డు ఇరుకుగా ఉంది. ఆటో లేదా ఫోర్ వీలర్ వాహనం వస్తే ఎదురుగా వచ్చే వాహనదారులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే రైల్వే స్టేషన్ పక్కన గల రోడ్డును రైల్వే అధికారులు వాహనాలు రాకుండా మూసివేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్టేషన్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యలను ఇటీవల పట్టణానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రయాణికులతోపాటు రైల్వే సేవా సమితి సభ్యులు విన్నవించారు.
స్టేషన్ మీదుగా 121 రైళ్లు
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా 121 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్, సంపర్క్‌క్రాంతి, నవజీవన్, భాగ్యనగర్, ఇంటర్‌సిటి, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దానాపూర్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం బిలాస్పూర్, పాటలీపుత్ర, ధనాపూర్, గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు, సంఘమిత్ర రైళ్లను స్థాని కులు ఎక్కువగా రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని వివిధ మండలాల నుంచి ప్రతీరోజు నాలుగు వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సా గిస్తున్నారు. రైల్వేకు టికెట్ ద్వారా రోజూ రూ.3లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఆదాయం వస్తున్నా సౌకర్యాలు మెరుగుపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇబ్బందులు పడుతున్నాం
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర సమయంలో కారు, ఆటోలో వెళ్తే ఇరుకు రోడ్డుపై గంటల తరబడి ఆగాల్సి వస్తోంది.
– పవన్ బల్దేవ్, రైల్వే యాత్రి
సేవా సమితి పీఆర్వో, కాగజ్‌నగర్
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
స్టేషన్‌కు రావాలంటే రైల్వే క్వార్టర్ల పక్కన ఉన్న రోడ్డు గుండా ఇంతకు ముందు ఇబ్బందులు లేకుండా వచ్చేవాళ్లం. కొన్నిరోజుల క్రితం అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. గోడను తొలగించాలని వారికి విన్నవించాం. ప్రయాణికుల సౌకర్యార్థం సరైన రోడ్డు ఏర్పాటు చేయాలి.
– అరుణ్ లోయ, కాగజ్‌నగర్

రైల్వేస్టేషన్‌కు దారేది?

రైల్వేస్టేషన్‌కు దారేది?

రైల్వేస్టేషన్‌కు దారేది?