
షరా మామూలే!
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ నెల 9న దహెగాం మండల కేంద్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్కాపూర్‌కు చెందిన వ్యాన్‌లో కన్నెపల్లి నుంచి 54 క్వింటాళ్లు తరలించి దహెగాం మండల కేంద్రంలోని వాసవీ మోడ్రన్ రైస్ మిల్లులో అక్రమంగా అన్‌లోడ్ చేస్తుండగా మిల్లు యజమానితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.
సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేట్ సమీపంలో రైస్‌మిల్లులో అక్రమంగా
నిల్వ ఉంచిన రేషన్ బియాన్ని ఈ నెల 11న పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సుమారు 100 క్వింటాళ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

షరా మామూలే!