
బాపూజీ సేవలు మరువలేనివి
ఆసిఫాబాద్‌అర్బన్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కో సం రాజీ లేని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయంగా, సామాజికంగా ఎత్తుపల్లాలు చూశారని తెలిపారు. ఉద్యమాలే ఊపిరిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేశారన్నారు. జిల్లాలో బాపూజీ విగ్రహ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, లింగ య్య, చిప్ప సురేశ్, ఇరుకుల మంగ, పుష్పలత, సునీత, క్రాంతి, రేవతి, శైలేందర్, మోహన్, తిరుపతి, ధర్మయ్య, రమేశ్, వెంకటేశ్, రవీందర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న నాయకులు