
విద్యాసంస్థల అభివృద్ధికి చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈవోలు, సెక్టోరియల్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఇన్‌చార్జి డీఈవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ తదితర కార్యక్రమాలను డీఈవోల సమన్వయంతో ప్రతీ పాఠశాలలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎంఈవోలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం సందర్శించి బడుల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, అబిద్ అలీ, మధుకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.