
అఖిల భారతీయ విజ్ఞాన మేళాకు ఎంపిక
ఆసిఫాబాద్‌అర్బన్: ఈనెల 18, 19, 20 తేదీ ల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ భార త విజ్ఞాన మేళాలో సంస్కృతి బోధపరియోజన ప్రశ్నమంచ్ అంశంలో పాల్గొని అఖిత భారతీయ విజ్ఞాన మేళాకు జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ (ఇంగ్లిష్ మీడియం) విద్యార్థులు గుత్తి వెంకటరత్న, కల్లూరి చరణ్, హరిచరణ్ ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపా ధ్యాయుడు కోటేశ్వర్‌రావ్ శనివారం తెలిపా రు. వీరు నవంబర్ 4, 5, 6, 7తేదీల్లో బిహార్‌లోని సీతామడీలో నిర్వహించనున్న అఖిల భారతీయ విజ్ఞాన మేళాకు ఎంపికైనట్లు పే ర్కొన్నారు. వీరికి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షు డు చామర్తి ఉమామహేశ్వర్‌రావ్ బహుమతి ప్రదానం చేసి అభినందించారు. దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్‌రావ్ పాల్గొన్నారు. వి ద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సత్యనారాయణను సభ్యులు, ఆచార్యులు అభినందించారు.