
ఆడబిడ్డల పండుగ
బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. తొమ్మిది రోజులపాటు పసుపుతో గౌరమ్మను తయారు చేసి మహిళలు గౌరీదేవిని పూజిస్తారు. చిన్నారులు, యువతులు, వృద్ధులు అనే భేదం లేకుండా అందరూ కలిసి జరుపకొంటారు. ఆడబిడ్డలు జరుపుకొనే తొమ్మిది రోజుల పండుగ కోసం పూల దగ్గర నుంచి నైవేద్యం తయారీ వరకు ఇంటిల్లిపాది సహకరిస్తారు. ప్రకృతిలో దొరికే పూలను దైవంగా భావించి పూజించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.
– వేమారం మహేశ్వర్‌శర్మ,
శివాలయం పురోహితుడు, చెన్నూర్