
ప్రహరీ క్లబ్‌లతో డ్రగ్స్ నిర్మూలన
కెరమెరి(ఆసిఫాబాద్): పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మత్తు పదార్థాల నియంత్రణలో విద్యార్థులను భాగస్వాములను చేసేలా జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశా ల ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, సీనియర్ ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా ఆరు నుంచి పదో తరగతి వరకు ఇద్దరు విద్యార్థుల చొప్పున క్లబ్‌లో సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరికి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌కు సభ్యులుగా అవకాశం కల్పిస్తారు.
ఇవీ.. నిబంధనలు
డ్రగ్స్ నివారణపై పాఠశాల ఆవరణల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్ఫలితాలు, అవగాహన నినాదాలు, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబర్లు 18005996969, 1800110031 పాఠశాల గోడలపై రాయించాలి. మాదక ద్రవ్యాల ను నివారిస్తామంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలి. విద్యాసంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించాలి. అల్కహాల్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, నార్కోటెక్ పదా ర్థాల విక్రయాలు పాఠశాల నుంచి 100 మీటర్ల వరకు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శిస్తూ లోపాలను సవరించాలి.
సమన్వయంతోనే నియంత్రణ
డ్రగ్స్ బాధితులను గుర్తించి చికిత్స అందించాలి. డ్ర గ్స్ నియంత్రణకు పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసే ప్రతీ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలి. విద్యార్థుల్లో ఏదైన అసాధారణ ప్రవర్తన గుర్తిస్తే కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలి. బాధితులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. పోలీస్, ఆరోగ్య, ఎకై ్సజ్ శాఖలతో పాటు ఎన్జీవోలతో పాఠశాల విద్యాశాఖ సమన్వయం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
కొనసాగుతున్న కార్యక్రమాలు
ప్రహరీ క్లబ్‌లలోని సభ్యులతోపాటు పోలీసులు కూ డా మాదక ద్రవ్యాల నిర్మూలనపై పాఠశాలల్లో వి ద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లోగల ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్ధాలను పోలీసులు విద్యార్థులకు వివరిస్తున్నారు. మొత్తంగా పాఠశాల స్థాయి నుంచి చేపడుతున్న డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ఉన్నత పాఠశాలలు 60
ప్రాథమికోన్నత పాఠశాలలు 100
విద్యార్థులు 32,143
జిల్లా సమాచారం