ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలబాలికల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం కనక కర్నూ, పీడీ హీరాబాయి తెలిపారు. వీరిని శనివారం ట్రైబ్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.రమాదేవి, షూటింగ్ బాల్ జిల్లా కార్యదర్శి గురువేందర్, గిరిజన క్రీడల అధికారి మడావి షేకు, ఏసీఎం ఉద్ద వ్, జీసీడీవో శకుంతల, ఏటీడీఏ చిరంజీవి, హెచ్‌డబ్ల్యూవో మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, తిరుమ ల్, అరవింద్, రవి, యాదగిరి, రాకేశ్, సాయి, అ ధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
కబడ్డీ పోటీలకు సాయిదీక్ష..
జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని బొట్టుపల్లి సాయిదీక్ష మంచిర్యాల జిల్లా మందమర్రి పట్ట ణంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయిదీక్షను ఫిజికల్ డైరెక్టర్ తిరుపతి, శ్రీవర్ధన్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
నెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు
జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో శనివారం జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లాస్థా యి బాలబాలికలు, మెన్, ఉమెన్ నెట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో బాలికలు 12మంది, బాలు రు 12మంది, సీనియర్ మెన్, ఉమెన్ విభాగాల్లో 12మంది చొప్పున వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి 100 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచినవారంతా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ మ హేశ్వర్, తిరుపతి, హరికృష్ణ, ఏడుకొండలు, రాకేశ్, కిరణ్, నాగమణి తదితరులు హాజరయ్యారు.
కిక్ బాక్సింగ్‌లో రాణించిన విద్యార్థినులు
దహెగాం: మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థి నులు రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్‌లో రాణించారని పీ ఈటీ శ్రీలత తెలిపారు. మూడురోజుల క్రితం హన్మకొండలో నిర్వహించిన ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో 9వ తరగతికి చెందిన తేజస్విని, ప్రథమ స్థానం, 10వ తరగతి విద్యార్థినులు కే అశ్విత, హిమబిందు తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించినందున శనివారం విద్యార్థినులను అభినందించారు.
సాయిదీక్షను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మహేశ్
షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక