
చట్టపరమైన పరిజ్ఞానం అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: నేరాల నియంత్రణలో చట్టపరమైన పరిజ్ఞానం అవసరమని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక చట్ట అవగాహన సమావేశం నిర్వహించగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్ష్యాధారా ల సేకరణలో జాగ్రత్తలు, దర్యాప్తు పద్ధతులు, ఎఫ్ ఐఆర్ నమోదు విధానం, మైనర్ కేసుల్లో చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాలు, మహిళలపై జరిగే నేరాల పరిధిలో అమలు చేయాల్సిన నిబంధనల గురించి విపులంగా వివరించారు. పోక్సో చట్టం 2012, జువైనల్ జ స్టిస్ యాక్ట్ 2015, మోటార్ వెహికిల్ యాక్ట్ 1998, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018, ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985, సైబర్ నేరాలపై అమలు చేయాల్సిన చట్టా లు తదితర అంశాలపై ఉదాహరణలతో అవగాహ న కల్పించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు చట్టాలపై నిర్వహించే అవగాహన సమావేశాలను సద్వినియోగం చేసుకు ని పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, పీపీ రమణారెడ్డి, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.