
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
ఆసిఫాబాద్: న్యాయవాదుల రక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం న్యాయవాదులతో కలిసి కోర్టు విధులు బహిష్కరించారు. రక్షణ చట్టం అమలు చే యాలని సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ క్రిమినల్ కోర్టులోని న్యాయవాదులు అనిల్, హనుమాన్ నాయక్‌పై కక్షిదారులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రోజురోజుకూ న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చరణ్, సీనియర్ న్యాయవాదులు ముక్త సురేశ్, బోనగిరి సతీశ్‌బాబు, నికోడె రవీందర్, కిశోర్, గణపతి, రామకృష్ణ, చంద్రకుమార్, రౌనక్ అగర్వాల్ పాల్గొన్నారు.