ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం) మేళా నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలు రాష్ట్రంలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగులో వాంకిడి మండలంలోని ఎంపీపీఎస్ భీంగూడ పాఠశాలకు చెందిన నగేశ్ కుమార్ మొదటి స్థానంలో నిలవగా, ఆసిఫాబాద్ మండలం గోవింద్‌పూర్ ఎంపీపీఎస్ స్కూల్‌కు చెందిన హిమబిందు రెండోస్థానంలో నిలి చింది. ఇంగ్లిష్ టీఎల్‌ఎంలో తిర్యాణి మండలం ఉల్లిపిట్ట యూపీఎస్ ఉపాధ్యాయుడు వంశీకృష్ణ, దహెగాంలోని ముత్తపేట ఎంపీపీఎస్ టీచర్ సుప్రియ, గణితంలో ఆసిఫాబాద్ మండలం గోవింద్‌పూర్ ఎంపీపీఎస్ టీచర్ భాగ్యలక్ష్మి, తిర్యాణి మండలం గంభీరావుపేట యూపీఎస్ టీచర్ రవి, ఈవీఎస్‌లో జైనూర్ మండలం లక్ష్మిపూర్ ఎంపీపీఎస్ టీచర్ ప్రమీల, సిర్పూర్(టి) యూపీఎస్ టీచర్ వెంకటేశ్, ఉర్దూ మీడియంలో కాగజ్‌నగర్ మండలం దంతన్‌గూడ యూపీఎస్ టీచర్ సుల్తానా ఉత్త మ టీఎంఎల్‌లు ప్రదర్శించారు. కార్యక్రమంలో ని ర్వాహకులు క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఉదయ్‌బాబు, ఎంఈవోలు సుభాష్, ప్రకాశ్, హనుమంతు, వెంకటేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.