
లాభాల వాటా చెల్లించాలని ధర్నా
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మికులకు 35 శా తం వాటా చెల్లించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి డిమాండ్ చేశారు. గోలేటిలోని జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ యాజమాన్యం 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలన్నారు. సొంతింటి పథకం అమలు చేయాలని, అలవెన్స్‌లపై ఐటీని యాజమాన్యమే చెల్లించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, డిస్మిస్ కార్మికులకు మరోసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జీఎం విజయ భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, రాజేశ్, కిరణ్‌బాబు, చంద్రశేఖర్, ఆనంద్, ఫిట్ కార్యదర్శులు శ్రీనివాస్, రామయ్య, అశోక్, మల్లేశ్, రమేశ్, ఓదెలు, షిఫ్ట్ ఇన్‌చార్జి అంజయ్య, వెంకటేశ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.