
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని, యజమానులపై కేసులు సైతం నమోదు చేస్తామని డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలో శుక్రవారం బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. 14 ఏళ్లలోపు బాలబాలికలను విధిగా పాఠశాలలకు పంపించాలన్నారు. బాల్య వివాహాలు చేయకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల్యవివాహాల గురించి సమాచారం ఉంటే 1098 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి దేవిక, హెచ్‌ఎం నరహరి తదితరులు పాల్గొన్నారు.