పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం | - | Sakshi
Sakshi News home page

పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం

Sep 18 2025 7:29 AM | Updated on Sep 18 2025 7:29 AM

పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం

పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం

● నేటి నుంచి నెల రోజులపాటు ‘పోషణ మాసం’ ● బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు అవగాహన ● పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మొద టి వారం పౌష్టికాహార పంటలపై పోటీలు నిర్వహిస్తారు. బీఎంఐ పరీక్షలు, పిల్లల ఎత్తు బరువు చూడడం, ఆహారంలో చక్కెర, నూనె తగ్గించ డం, తండ్రులతో పోషకాహార ప్రతిజ్ఞలు, కథలు చెప్పడం, స్థానిక ఉత్పత్తులపై అవగాహన, స్థానిక వంటకాలను ప్రోత్సహించడం చేస్తారు. ● రెండోవారం ముర్రుపాలు, పిల్లల అనుబంధ ఆహారాలపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన పిల్లల తల్లులు పోషణ లోపం ఉన్న పిల్లల తల్లులతో అనుభవాలు పంచుకుంటారు. చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలపై సమావేశాలు నిర్వహిస్తారు. ● మూడో వారం అతి తీవ్ర పోషణలోపంతో బాధపడుతున్న పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తారు. రక్తహీనత, అధిక బరువుపై కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తారు. హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలలో యోగా సాధన, పోషణ్‌ మిషన్‌ వంద రోజుల కార్యక్రమం ప్రారంభిస్తారు. పోషణ చాంపియన్లు నిలిచిన తండ్రులను సత్కరిస్తారు. ● నాలుగో వారం తాగునీరు, వ్యక్తిగత పరిసరాల శుభ్రతపై అవగా హన కల్పిస్తారు. ఆరు నెలల లో పు వయస్సు ఉన్న పిల్లల బాలింతల ఇళ్లను సందర్శిస్తారు. పురుషులకు అవగాహన కల్పిస్తారు. తక్కువ నూనె, చక్కెర పదార్థాల ప్రదర్శణ, ఒకసారి వాడేసి పడేసే ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం నుంచి పోషణమాసం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ, మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా పోషణ మాసం నిర్వహిస్తోంది. గతంలో సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగగా, ఈ ఏడాది మాత్రం సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 16 వరకు 30 రోజుల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రస్తుతం అంగన్‌వాడీ ఉద్యోగులు శిక్షణలో ఉండటంతో కార్యక్రమం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమవుతుందని అధికారులు వెల్ల డించారు. మహిళల ఆరోగ్యం, పిల్లల విద్య వంటి నినాదాలతో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

పోషకాహార లోపం.. రక్తహీనత

జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఫలితంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండటంతో పుట్టబోయే బిడ్డలపై ప్రభావం పడుతోంది. పాలిచ్చే తల్లులు కూడా పోషకాహారం తీసుకోకపోవడంతో చిన్నారులు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల్లో మానసిక, శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు. ఆయా సమస్యలను రూపుమాపడం, పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏటా నెలరోజులపాటు పోషణ మాసం నిర్వహిస్తుంది. నాలుగు వారాలపాటు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టనున్నారు.

కార్యక్రమాలు ఇవే..

పకడ్బందీగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌: పోషణమాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసం– 2025లో భాగంగా అక్టోబర్‌ 16 వరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌, డీఆర్‌డీవో దత్తారావు, డీఎంహెచ్‌వో సీతా రాం, డీపీవో భిక్షపతి పాల్గొన్నారు.

భాగస్వాములు కావాలి

జిల్లాలో గురువారం నుంచి పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతీ వారం షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు భాగస్వామ్యులు కావాలి. ఈ కార్యక్రమం ఈ నెల 17 నుంచే ప్రారంభించాల్సి ఉంది. అయితే అంగన్‌వాడీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నాం.

– భాస్కర్‌, ఐసీడీఎస్‌ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement