
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. బుధవారం సమ్మె ఆరో రోజుకు చేరుకోగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కుమురం భీం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కు మురంభీం విగ్రహానికి పూలమాల వేసి నిరసన తె లిపారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, సదాశివ్, వర్కర్లు గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.