
‘సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు’
కాగజ్‌నగర్‌రూరల్: రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న స్పష్టం చేశారు. పట్టణంలోని స్టేషన్‌రోడ్‌లో గల సీపీఎం కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం భూస్వాములు, జాగీర్‌దార్లు, రజాకార్లను తరిమికొట్టారని తెలిపా రు. ఈ పోరాటంలో ఎర్రజెండా పాత్రను కప్పిపెట్టడానికి నేటి పాలకులు ప్రజాపాలన, జాతీ య సమైక్యత, విమోచన, విద్రోహ దినం అంటూ ప్రజా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోట శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు వనమాల పద్మ, ఎన్.పద్మ, సుదర్శన్, అంగల శ్రీనివాస్, శంకర్, సంజీవ్ పాల్గొన్నారు.