
వాస్తు శిల్పులకు ఆదర్శప్రాయుడు
ఆసిఫాబాద్‌అర్బన్: నేటి వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని శాసన మండలి డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా బీసీ అధికారి సజీవన్ అధ్యక్షతన నిర్వహించిన విశ్వకర్మ జయంతికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్పీ చిత్తరంజన్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. మొ దట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆ ర్కిటెక్చర్ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎన్నో రాజ భవనాలు నిర్మించిన గొప్ప నైపుణ్యకారుడు విశ్వకర్మ అని కొనియాడారు. ఇంజినీరింగ్ వృత్తిదారులకే కాకుండా చేతివృత్తి కళాకారులు కూడా ఆయనను అనుసరించారని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మ న్ అలీబిన్ అహ్మద్, విశ్వబ్రాహ్మణ సంఘం నా యకులు భాస్కరచారి, వేణుగోపాల్, రాధాకృష్ణచారి, సంతోష్‌చారి, అశోక్‌చారి, సురేశ్‌చారి, వెంకటేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.