
వ్యూహకర్త.. బాపూజీ
నిజాం నిరంకుశ పా లనపై పోరాడిన వారిలో ఆసిఫాబాద్ కు చెందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో సైతం ఆయన పాలుపంచుకున్నారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత మహారాష్ట్రలోని రాజూరాలో ఆయన జన్మించారు. 1938లో తొలిసారి అరెస్టయ్యారు. 1941– 42లో ఖద్దరు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1947లో కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చిన నిజాం నవాబుపై బాంబులు విసిరిన ఘటనలో బాపూజీ నిందితుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని చాందా మిలటరీ క్యాంపులో పంజాబ్ రెజిమెంట్ మేజర్ పీస్ గుహాన్ వీరికి శిక్షణ అందించారు. అక్కడ క్యాంపు ఇన్‌చార్జి గోపాల్‌శాస్త్రి బేకర్, బల్లార్షా క్యాంప్ ఇన్‌చార్జిగా కేవీ కేశవులు ఉన్నారు. కొండా లక్ష్మణ్ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. హైదరాబాద్ సంస్థాన్‌ను ఇండియన్ యూనియన్‌లో కలపాలనే ఉద్యమం కారణంగా ఆయన 13సార్లు అరెస్టు అయ్యారు.