
రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి అరవింద్ బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణ లో పీడీ తిరుపతి, అధ్యాపకులతో కలిసి వి ద్యార్థిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో జనగాంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో చాప్లే అరవింద్ ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పతకం కై వసం చేసుకున్నాడని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.