
‘చరిత్రను వక్రీకరిస్తున్న పాలకులు’
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీపీఐ జెండాను జిల్లా కార్యదర్శి బద్రి సాయి ఆవిష్కరించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ సాయుధ పోరాటానికి సంబంధించి సర్వహక్కులు సీపీఐ పార్టీకే దక్కుతాయన్నారు. నాటి పోరాటంలో దొడ్డి కొముయ్యతోపాటు 4,500 మంది అమరులయ్యారని, తెలంగాణలోని గ్రామాల్లో నేటికీ నెత్తుటి ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, అమరుల జీవిత చరిత్రను తక్షణమే పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బద్రి సత్యనారాయణ, ఆత్మకూరి చిరంజీవి, ఉపేందర్, పిడుగు శంకర్, నర్సయ్య, రాజశేఖర్, శ్రీకాంత్, మహేశ్, వెంకటేశ్, అజయ్, వికాస్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.