
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించిన ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఇదే ఉత్సాహంతో జాతీయ స్థాయిలో పోటీల్లోనూ రాణించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజ య భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 14న జనగామ జిల్లాలో జరిగిన అండర్– 14 బాల్‌బ్యాడ్మింటన్ పో టీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు చాంపియన్‌షిప్ సాధించగా, మంగళవారం అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు జీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారిని జీఎం అభినందించారు. క్రీడాకారులకు సహకరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, షార్ప్‌స్టార్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, డీజీఎం ఉజ్వల్‌కుమార్ పాల్గొన్నారు.