
‘అమ్మ’ మొక్కను బతికించాలి
ఆసిఫాబాద్‌రూరల్: అమ్మ పేరుతో నాటిన మొక్కను బతికించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివా రి అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మొక్కలు నాటించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. జి ల్లాలోని 1,065 పాఠశాలల్లో 20,327 మొక్కలు నాటినట్లు తెలిపారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటిన మొక్క ఫొటోను ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాల్ మహేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.