
ఎమ్మెల్యే ఇంటి ఎదుట అంగన్‌వాడీల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం ఎ దుట సోమవారం తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌లు ధర్నా ని ర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీని వాస్ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.18వేల వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ జీవో నం.8 సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, 24 రోజుల సమ్మె కాలపు వేత నం ఇతర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కేంద్ర ప్ర భుత్వం ఐసీడీఎస్‌తోపాటు విద్యా వ్యవస్థను నిర్వీ ర్యం చేసేందుకు తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు వనిత, ఉమాదేవి, తార, రాధ, సువర్ణ, రాజేశ్వరి, చంద్రకళ, తిరుపతమ్మ తదతరులు పాల్గొన్నారు.