
సమాజంలో ఇంజినీర్ల పాత్ర కీలకం
రెబ్బెన(ఆసిఫాబాద్): సమాజంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమైందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిటౌన్ షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సృజనాత్మకతో పనిచేసే ప్రతీ ఇంజినీరు దేశానికి ఎంతో అవసరమన్నారు. సైన్స్ అంటేనే తెలుసుకోవడమని, ఇంజినీరింగ్ అంటేనే సృష్టించడం అని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ నిర్విరామంగా కొనసాగేందుకు అన్ని విభాగాలు ఎంతో అవసరమని, అందులో ఇంజినీరింగ్ విభాగం ఎంతో కీలకమన్నారు. అనంతరం సివిల్ డీజీఎం ఎస్‌కే మదీనాబాషాను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, డీజీఎం ఉజ్వల్‌కుమార్, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
సీహెచ్‌పీ ఇంజినీర్లకు సన్మానం
గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే సందర్భంగా గోలేటి సీహెచ్‌పీలో పనిచేస్తున్న ఇంజినర్లను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అన్నం రమేశ్, సభ్యులు మహేందర్‌రెడ్డితో కలిసి సీహెచ్‌పీ హెచ్‌వోడి కోటయ్యతోపాటు మిగిలిన వారిని శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.