
వేతనాలు ఇప్పించండి సారూ..!
ఆసిఫాబాద్‌రూరల్: ‘మా పెండింగ్ వేతనాలు ఇప్పించండి సారూ’ అని గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు సో మవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించా రు. వారు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడు నెలలు గా వేతనాలు రావడం లేదని తెలిపారు. 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు రెగ్యులరైజ్ చేయాలని, టైం పే స్కేల్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణమాచారి, గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.