
రోడ్డెక్కిన అన్నదాత
కెరమెరి(ఆసిఫాబాద్): యూరియా కోసం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ‘కావాలి కా వాలి.. యూరియా కావాలి..’ అంటూ నినా దాలు చేశారు. ఏవో యుగేంధర్, ఎస్సై మధుకర్ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. మూడు వాహనాలు వచ్చినట్లు సమాచారం ఉందని, కానీ ఒకే లోడ్ ఇక్కడ దింపారని, సాగుఎకరాల ప్రకారంగా యూ రియా పంపిణీ చేయాలని పట్టుబట్టారు. ఏవో మాట్లాడుతూ ఇండెంట్ పంపించినా ఒకటే లోడ్ వచ్చిందని, ఒకరికి రెండు బస్తాలే మాత్రమే ఇస్తామని చెప్పారు. రెండు రోజుల్లో మరో వాహనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా సో మవారం ఉదయం 5 గంటలకే రైతులు కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 8:30 గంటలకు అధికారులు వచ్చి టోకెన్ల ప్రకారం బస్తాలు ఇవ్వడం ప్రారంభించడంతో కొంత వాగ్వాదం జరిగింది. క్యూలో ఉ న్నవారికి ఇవ్వాలని కొందరు పట్టుబట్టారు. ఏఈవో, ఎస్సై వారిని శాంతింపజేశారు.