స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం

Sep 14 2025 2:28 AM | Updated on Sep 14 2025 2:28 AM

స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం

స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం

● రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ ● కాగజ్‌నగర్‌లో సదుపాయాలపై ఆరా

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ పేర్కొన్నారు. శని వారం ప్రత్యేక రైలులో కాగజ్‌నగర్‌ స్టేషన్‌కు వచ్చిన ఆయనకు సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బా బు స్వాగతం పలికారు. అనంతరం వారు స్టేషన్‌లో ని సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జీ ఎం మాట్లాడుతూ.. ఈనెల 18న సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు (20102) కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే స్టేషన్‌లో వసతుల పరిశీలన కు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం స్టేషన్‌ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని జీఎంకు ఎ మ్మెల్యే హరీశ్‌బాబు వినతిపత్రం అందజేశారు. స్టే షన్‌లోని మూడో ప్లాట్‌ఫాంపై కనీస వసతులు క ల్పించాలని, షెడ్లు నిర్మించాలని, టికెట్‌వెండింగ్‌ మి షన్‌ లేదా టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలని కోరా రు. మూడు ప్లాంట్‌ఫాంలకు మూడు లిఫ్ట్‌లు ఏర్పా టు చేయాలని, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ప్రయాణికులకు అనుగుణంగా వెడల్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప భక్తుల కోసం కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలును కా గజ్‌నగర్‌లో నిలుపాలని, చర్లపల్లి నుంచి వయా కా గజ్‌నగర్‌ మీదుగా హౌరాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, పాటలీపుత్ర, గోరఖ్‌పూర్‌, అమృత్‌భారత్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని విన్నవించారు. ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జీఎంను ఎమ్మెల్యేతోపాటు రైల్వే యా త్రి సేవా సమితి, రైల్వే ఉద్యోగుల సంఘం, బీజేపీ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సన్మానించారు. కాగజ్‌నగర్‌ రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలు జీఎంకు సమస్యలు వివరించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని వానాకాలంలో ఉరుస్తున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని సూచించారు. జీఎం వెంట డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌, చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎస్కే శర్మ, సీనియర్‌ డీఎం కోఆర్డినేటర్‌ డీఎస్‌ రామారావు, సికింద్రాబాద్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ నవీన్‌కుమార్‌, డీవోఎం సురేశ్‌, డీసీఎం సఫాలీ, ఆర్పీఎఫ్‌ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్‌ దాసు, జీఆర్పీలు సురేశ్‌, శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement