
22 నుంచి బ్రహ్మోత్సవాలు
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని డౌనల్ ప్రాంతంలోగల శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గంగు సత్యనారాయణ తెలిపారు. ఈనెల 22న పల్లకీసేవ, 23న కల్పవృక్ష వాహన సేవ, 24 సూర్యప్రభ వాహన సేవ, 25న హంస వా హన సేవ, 26 శేష వాహన సేవ, 27న హనుమంత వాహన సేవ, 28న అశ్వ వాహన సేవ, 29న గజ వాహన సేవ, 30న సింహ వాహన సేవ, అక్టోబర్ 1న గరుడ వాహన సేవ, 2న ద సరా రోజు రథోత్సవం, శ్రీనివాస్ కల్యాణ మ హోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోజూ రాత్రి 7.30 నుంచి వాహన సేవ ప్రారంభమవుతుందని, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.