
రోడ్డు పనుల్లో నాణ్యత లోపం
కెరమెరి: ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు ని ర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ తెలిపారు. డీ ఆర్డీవో, అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడమే కారణమని ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా సలహాదారు కనక ప్రభాకర్, నాయకులు మడావి పురుషోత్తం, జ్యోతిరాంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కొన్నిచోట్ల రోడ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరో పణలున్నాయని తెలిపారు. అక్రమాలపై కలెక్ట ర్ వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకోకుంటే తుడుందెబ్బ ఆ ధ్వర్యంలో నిరసనలు చేపడతామని పేర్కొన్నా రు. ఈ విషయమై డీఆర్డీవో దత్తారాంను సంప్రదించగా.. రోడ్లు మంజూరు చేసే అధికారం తనకు లేదని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయే అవసరం అంతకన్నా లేదని వివరించారు.