
సార్లొస్తే ఓపెన్.. వెళ్లాక తాళం
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌ను శనివారం రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు తనిఖీ చేశారు. ఈ సమయంలో 2, 3 ప్లాట్‌ఫాంలపై ఉన్న మల్టీపర్పస్ స్టాళ్లను అధికారులు హడావుడిగా తెరిపించారు. చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్‌బాటిళ్లు అందుబాటులో ఉంచారు. వారు వెళ్లాక వెంటనే మూసివేశారు. వీటిని నిత్యం మూసి ఉంచుతుండగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికధరకు బయటి నుంచి కొని తెచ్చుకుంటున్నారు. స్టాళ్లను నిత్యం తెరిచి ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. – కాగజ్‌నగర్ టౌన్

సార్లొస్తే ఓపెన్.. వెళ్లాక తాళం