
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
ఆసిఫాబాద్: రాజీ మార్గంలోనే కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదా యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అ దాలత్‌లో 8,811 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు పక్షాలు రా జీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే పై కో ర్టుకు అప్పీల్‌కూ వెళ్లే అవకాశం ఉండదని తెలిపా రు. రాజీ అయిన కేసుల్లో అదేరోజు అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7,974 ప్రిలిటిగేషన్ కేసులు, 581 ఎస్టీసీ అడ్మిషన్, 191 సీసీ అడ్మిషన్, 40 సీసీ కాంప్రమైజ్ కేసులతోపాటు మరిన్ని కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రూ.2,36,68,862 అవార్డు, రూ.18,15,350 జరిమానా, రూ.4,62,080 బ్యాంక్ చెల్లింపులు, రూ.17,39,995 ఈ చలానాలు విధించినట్లు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి కే యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి రాపర్తి రవీందర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో..
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని జూనియర్ సివి ల్ కోర్టు పరిధిలోని 405 కేసులు పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ కోర్టు సిర్పూర్(టీ) ఇన్‌చార్జి మెజి స్ట్రేట్ అనంతలక్ష్మి తెలిపారు. ఆన్‌లైన్‌లో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించినట్లుపేర్కొన్నారు.