
ఎమ్మెల్యేను కలిసిన ఆర్‌అండ్‌బీ సీఈ
కాగజ్‌నగర్ టౌన్: ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి శనివారం సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబును మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలోడి, సల్గుపల్లి మధ్య ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని సీఈని కోరారు. దీంతో కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు మండలాలకు పూర్తిగా డబుల్ రోడ్డు సౌకర్యం కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి పీఆర్‌ఐఎం నిధుల మంజూరుకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పిస్తానని తెలిపారు. వెంటనే సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. స్పందించిన సీఈ పనుల వేగవంతం చేయడానికి ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారు.