
ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన ప్రసవం
ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం అర్ధరాత్రి క్లిష్టమైన ప్రస వం చేశారు. వైద్యులు తెలి పిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలానికి చెందిన భీంబాయి శనివారం రాత్రి వాంకిడి ఆస్పత్రి నుంచి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యుడు సందేశ్ ఆధ్వర్యంలో డెలివరీ కోసం యత్నించారు. అయితే బ్రీచ్ ప్రజెంటేషన్(ఎదురుకాళ్లు) సమస్య ఎదురుకావడంతో మంచిర్యాలకు పంపించేందుకు నిర్ణయించారు. కానీ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆగిపోయారు. ఆపరేషన్ చేయాల్సి ఉండగా క్లిష్టమైనా తీవ్రంగా శ్రమించి భీంబాయికి సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఆ తర్వాత పాపను పరీక్షల కోసం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి పంపించారు. కీలకంగా వ్యవహరించిన నర్సింగ్ అధికారి కవ్వాల రజితకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఆఫ్రిన్, ఆసియా పాల్గొన్నారు.