
ఆదివాసీ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలి
ఆసిఫాబాద్: ఆదివాసీ గ్రామాల్లో వైద్య శిబిరా లు న్విహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజ న సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలు జ్వరాలతో మంచా న పడ్డారని, హాస్టల్ విద్యార్థులు కూడా జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, మెడికల్ షాపుల యజమానులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి తనుషా, నాయకులు సక్కు, మడావి నాగోరావు, తొడసం శంభు, నెర్పెల్లి అశోక్, కోట శ్రీనివాస్, మడావి గణపతి, టీకానంద్ పాల్గొన్నారు.