
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకా లు సాధించారని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియ ర్ యోగాసన పోటీల్లో కాగజ్‌నగర్‌లోని ఫాతి మా కాన్వెంట్ హైస్కూల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి సీహెచ్ శ్రీయాన్ సుపైన్ ఫోజు విభాగంలో బంగారు పతకం సాధించగా, లెగ్ బ్యాలెన్స్ విభాగంలో కౌటాల జెడ్పీ హై స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి అఖిల్‌సింగ్ వెండి పతకం సాధించారన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే జాతీ యస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు. శ్రీయాన్, అఖిల్‌సింగ్‌ను తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కోచ్ ఏడుకొండ అభినందించారు.